Wednesday, January 22, 2025

బాయ్ ఫ్రెండ్‌తో కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్

- Advertisement -
- Advertisement -

కీర్తి సురేష్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చైల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ’గీతాంజలి’ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘నేను శైలజ’తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. తొలి చిత్రంతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన ఆమె ’మహానటి’ మూవీతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

ఈ చిత్రంలో అలనాటి నటి సావిత్రిగా అద్భుతమైన నటనను కనబరిచి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే తాజాగా కీర్తి సురేష్ వచ్చే నెలలో తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనిని గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై తాజాగా కీర్తి సురేష్ తండ్రి స్పందించారు. గోవాలోని ఓ పెద్ద రిస్టార్ట్ లో కీర్తి సురేష్, ఆంటోని ల వివాహం జరగబోతున్నట్లు ఆయన అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. డిసెంబర్ 11 లేదా 12 న కీర్తి సురేష్ పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News