Thursday, December 26, 2024

మెరిసిన వెన్నెల..

- Advertisement -
- Advertisement -

Keerthy Suresh's first look out from Dasara

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ’దసరా’. నాని ఫస్ట్‌లుక్ నుంచి ఇటీవలే విడుదలైన ఫస్ట్ సాంగ్ ధూమ్‌ధామ్ వరకు అద్భుతమైన స్పందనతో సినిమాపై ఆసక్తిని పెంచాయి. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెను వెన్నెలగా పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కీర్తి సురేష్ అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా మెరిసింది. కొత్తపెళ్లి కూతురు ధరించే పసుపు చీరలో హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించిన కీర్తి సురేష్ ‘దసరా’లో ఆమె పాత్రపై అంచనాలని పెంచింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది.

Keerthy Suresh’s first look out from Dasara

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News