Sunday, December 22, 2024

తెలంగాణలో మరోసారి బిఆర్‌ఎస్ ప్రభుత్వమే:మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

కీసరః తెలంగాణలో మరోసారి వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కరీంగూడ గ్రామానికి పలువురు సర్పంచ్ కౌకుట్ల గోపాల్‌రెడ్డి, బిఆర్‌ఎస్ కీసర మండల నాయకులు కందాడి శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన తోట శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రజినికాంత్‌రెడ్డి, అచ్యుత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రఘువీరారెడ్డి, పాపిరెడ్డి, నర్సింహ్మరెడ్డి, రవీందర్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, చంద్రారెడ్డి, అనిల్‌రెడ్డిలకు మంత్రి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోస పోవద్దని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీకి భారీ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్స్‌ః

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News