ముంబై: సత్తువ, స్థితిస్థాపకత ప్రాముఖ్యతను బలోపేతం చేసే ప్రయత్నంలో, ఈ లెగసీ వైర్ బ్రాండ్ తన కొత్త వాణిజ్య ప్రకటన ద్వారా దేశంలోని యువతతో మాట్లాడుతోంది. బ్రాండ్ తన కస్టమర్ల పట్ల ప్రదర్శించే నిబద్ధత వలె, అనేక టెన్షన్‌లను ఎదుర్కొన్నప్పటికీ, ప్రతి పాత్ర తన లక్ష్యం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్న సందర్భాలపై ఈ చిత్రం ఆలోచనాత్మక వెలుగులను ప్రసరిస్తుంది.
● ఒక రీజనల్ మెట్రో సర్వీస్ ఉద్యోగి చలికాలం చల్లగా ఉండే వేకువ జామున లేవడంతో చిత్రం ప్రారంభమవుతుంది
● ఒక యువ సైన్స్ ఔత్సాహికుడు విజయవంతంగా ఒక ఆవిష్కరణ చేస్తుంటాడు
● దీక్షాబద్దుడైన ఆర్కిటెక్ట్ పగలంతా తాను బాగా అలసిపోయినప్పటికీ, తన ప్రాజెక్ట్ ను ఆ రోజు పూర్తి చేయాలని నిశ్చయించుకుంటుంది
● ఒక మహిళా బాక్సింగ్ అథ్లెట్ జాతీయ ఛాంపియన్‌షిప్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తన తిరుగులేని శక్తిని ప్రదర్శిస్తోంది
● ఒక యువ విద్యార్థిని ఇంటికి దూరంగా తన స్వతంత్ర జీవితంలోకి అడుగుపెడుతూ తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటుంటుంది
● తన భార్య సాధించిన విజయానికి గర్విస్తున్న భర్త
● భారత జట్టు కోసం కుటుంబాన్ని ఏకం చేసిన క్రికెట్ మ్యాచ్
Film link: https://www.youtube.com/watch?v=SIgzCJ1DvCw
ఈ అన్ని సందర్భాల్లోనూ కేఈఐ వైర్లు మరియు కేబుల్‌లతో సాఫీగా నడిచే ఉపకరణం/పరికరం ఈ కీలక అంశాలకు మద్దతుగా ఉంటుంది. ఐదు దశాబ్దాలకు పైగా అనుభవంతో కూడిన సంస్థగా కేఈఐ యువ తరంతో అనుసంధానం కావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది, తమ లక్ష్యాలను కోల్పోవద్దని వారిని కోరుతోంది. ఈ తరం యొక్క పెరుగుతున్న ఆకాంక్షలు మరియు భారీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వినియోగంతో, దీర్ఘకాలం ఉండే, భారీ మొత్తంలో లోడ్ తీసుకోగల నమ్మకమైన వైర్‌లతో బ్రాండ్ ట్యాగ్‌లైన్ – హర్ టెన్షన్ సహే, చల్తీ రహే అనే దానితో తన కస్టమర్‌లకు మద్దతు ఇవ్వడానికి బ్రాండ్ కట్టుబడి ఉంది.
ఈ ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా కేఈఐ వైర్స్ & కేబుల్స్ ఛైర్మన్, ఎండీ శ్రీ అనిల్ గుప్తా మాట్లాడు తూ, “భారతదేశంలో ఖాతాదారులకు విజయవంతంగా సేవలు అందించిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా 60 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేసిన తర్వాత, మేం మాతో కలసి ఉండే వారితో బలమైన పునాదిని నిర్మించుకున్నాం. అయితే, తాజా ప్రచారంతో మా దృష్టి అంతా కూడా అంతిమ వినియోగదారులతో, మరీ ముఖ్యంగా రేపటి నాయకులుగా ఉన్న దేశ యువతతో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంపై ఉంది. వారు తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారి కలలకు మద్దతు ఇవ్వడానికి వీలుగా మేం బలంగా ఉన్నామని వారు తెలుసుకోవడం చాలా ముఖ్యం’’ అని అన్నారు. ఈ క్యాంపెయిన్ కోసం బ్రాండ్ క్రియేటివ్ ఏజెన్సీ Django Digitalతో కలసి ఈ యాడ్ ఫిల్మ్ రూపొందించబడింది.