Monday, December 23, 2024

బిజెపి గెలిస్తే రాజకీయ సన్యాసం: కేజ్రీవాల్ సవాలు

- Advertisement -
- Advertisement -

Kejriwal about Delhi Municipal Elections 2022

న్యూఢిల్లీ: ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల వాయిదా నిర్ణయంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజెపిపై విమర్శలు తీవ్రతరం చేశారు. సకాలంలో ఈ ఎన్నికలను నిర్వహించి బిజెపి గెలిస్తే ఆప్ రాజకీయాల నుంచి వైదొలుగుతుందని సవాలు విసిరారు. దేశంలో అతి పెద్ద రాజకీయ పార్టీ అని ప్రచారం చేసుకనే బిజెపికి అతి స్వల్ప ఎన్నికలంటే భయం పట్టుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) ఎన్నికలను నిర్ణీత సమయం ప్రకారం నిర్వహించాల్సి ఉంది. వీటిని వాయిదా వేయడం దారుణం అని కేజ్రీవాల్ విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అన్ని స్థాయిల ఎన్నికలకు ప్రాధాన్యత ఉంది. ప్రజాస్వామ్యయుత వ్యవస్థకు బలిదానాలు చేసి బ్రిటిష్ వారి నుంచి దేశాన్ని విముక్త చేసిన అమరవీరులను అవమానించేలా బిజెపి వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పుడు ఈ ఎన్నికలను వాయిదా వేశారు. ఓడిపోతామనే భయం పట్టుకుంటే రాష్ట్రాల ఎన్నికలలోనూ ఇదే చేస్తారు. జాతీయ స్థాయిలో కూడా ఇదే విధంగా వ్యవహరించరని అనడానికి వీల్లేదని మండిపడ్డారు.

Kejriwal about Delhi Municipal Elections 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News