Saturday, November 16, 2024

‘ఢిల్లీ బజార్’ ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటుచేయనున్న ఢిల్లీ సర్కార్

- Advertisement -
- Advertisement -

Kejriwal
న్యూఢిల్లీ: వర్తకులు, దుకాణదారులు, సేవలు అందించేవారందరికీ ఉపయోగకరంగా ఉండే రీతిలో ‘ఢిల్లీ బజార్’ అనే ఆన్‌లైన్ పోర్టల్‌ను ఏర్పాటుచేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. ఈ పోర్టల్ ఢిల్లీ ప్రభుత పన్ను ఆదాయాన్ని, జిడిపి, ఉపాధికల్పనను బాగా పెంచగలదన్న ఆశాభావాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఈ పోర్టల్ 2022 ఆగస్టు నాటికి సిద్ధం అవుతుందన్నారు. ఈ పోర్టల్‌లో ప్రతి పారిశ్రామికవేత్త, ప్రతి దుకాణదారు, సేవలు అందించే ప్రతి వ్యక్తికి అవకాశం లభిస్తుందన్నారు. ఈ వెబ్‌సైట్‌లో దుకాణదారు తన వద్ద లభించే అన్ని వస్తువులను ప్రదర్శించవచ్చు. ఈ పోర్టల్ ద్వారా వర్తకులు తమ వస్తువులను ఢిల్లీ వాసులు, దేశ వాసులు, ప్రపంచ వాసుల వరకు తీసుకెళ్లవచ్చు. ఎవరైనా ఎక్కడైనా కూర్చుని కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా తమకు కావలసిన ప్రత్యేక వస్తువును గురించి సెర్చ్ చేసుకోవచ్చు.ఢిల్లీకి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు, వస్తువులు, సేవలన్నీ ఈ ఒక్క పోర్టల్ ద్వారా లభ్యం కాగలవని కేజ్రీవాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News