Wednesday, January 22, 2025

సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిఎం కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయగా, ఆ బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.  తాజాగా, ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సిఎం కేజ్రీవాల్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను అత్యవసర ప్రాతిపదికన రేపు (సోమవారం) విచారణ జరపాలని కేజ్రీవాల్ న్యాయవాదులు సుప్రీంకోర్టు రిజిస్ట్రీని కోరనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ అభియోగాలపై సిఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  (ఈడీ) అధికారులు మార్చి 21న అరెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటికి వచ్చిన ఆయన ఎన్నికలు ముగిశాక మళ్లీ జైలుకు వెళ్లారు.

కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంతో ఆయన విడుదలకు అవాంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే, కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News