Sunday, January 19, 2025

కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టు వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామన్న అమెరికా, ఈ కేసులో పారదర్శక విచారణ జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను పరిశీలిస్తున్నామని, సమయానుకూల పారదర్శక న్యాయ ప్రక్రియ జరుగుతుందని భావిస్తున్నామని అమెరికాకు చెందిన ఓ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

కేజ్రీవాల్ అరెస్టుపై ఇటీవల జర్మనీ స్పందించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి నిష్పాక్షికమైన న్యాయవిచారణకు అర్హులనీ, చట్టపరంగా అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ ఆయన వినియోగించుకోవచ్చునని జర్మనీ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఒకరు ఇటీవల ప్రకటన విడుదల చేయగా దీనిపై భారత్ మండిపడింది. ఇది తమ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనంటూ నిరనస వ్యక్తం చేసింది. తాజాగా అమెరికా కూడా జర్మనీ తరహాలోనే వ్యాఖ్యానించిన నేపథ్యంలో భారత్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News