లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సిఎంను అదుపులోకి తీసుకున్న ఇడి
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అరెస్టు…
స్వతంత్ర భారతంలో ఇదే తొలిసారి
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం రాత్రి ఆమ్ ఆద్మీపార్టీ నేత, సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఇడి అధికారులు అరెస్టు చేశారు. ఈ మద్యం కేసు సుడులు తిరిగితిరిగి చివరికి తీవ్ర ప్రకంపనల స్థాయికి చేరుకుంది. మరికొద్ది వారాలలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న దశలో, పార్టీలు ప్రచారాస్త్రాలు సంధించుకుంటున్న వేళలో కేజ్రీవాల్‌ను కేంద్రీయ దర్యాప్తు సంస్థ ఇడి అరెస్టు చే యడం కీలక పరిణామం అయింది. స్వతం త్ర భారతదేశ చరిత్రలో అధికారంలో ఉన్న ఒక్క సిట్టింగ్ సిఎంను అరెస్టు చేయడం ఇదే తొలిసారి. ఈ కేసులో గురువారం కూడా కే జ్రీవాల్ ఇడి సమన్లకు అనుగుణంగా ఇడి ఎదుట హాజరు కాలేదు. తనకు అరెస్టు కా కుండా రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు , ఆ తరువాత అత్యవసర ప్రాతిపదికన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ దశలోనే కేజ్రీవా ల్ నివాసంలో ఇడిబృందాలుపెద్ద ఎత్తున సో దాలునిర్వహించడం,వెలుపల జనం గుమికూడటం , భారీ ఉద్రిక్తతల నడుమ, ఓ వైపు ఢిల్లీ , పంజాబ్‌లలో హైవోల్టేజ్ ఉద్రిక్తత నెలకొన్నప్పుడే కేజ్రీవాల్‌ను ఇడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు ఆయన సతీమణికి విషయం తెలియచేశామని ఇడి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం ఆయనను కోర్టుకు హాజరుపరుస్తామని ప్రకటించారు.
గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకుని ఆయనను ఇడి కార్యాలయానికి తరలించారు. కాగా ఆ త రువాతి పరిణామాల పట్ల అత్యంత జాగ్రత్త గా వ్యవహరిస్తూ దేశ రాజధానిలో భారీ స్థా యిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాగా ఇ డి తమ నేతను అరెస్టు చేసినప్పటికీ , జైలుకు తరలించినప్పటికీ ఆయనే ఢిల్లీ సిఎంగా ఉంటారని , జైలునుంచే ఆయన పాలన సాగిస్తారని ఆప్ నేత, మంత్రి అతిషి ప్రకటించారు. అవసరం అయితే అధికారిక కార్యక్రమాలన్నింటిని జైలు నుంచే నిర్వహిస్తారని తెలిపారు. ఆయన దోషిగా నిర్థారణ కాలేదు. అంతవరకూ ఆయన బాధ్యతల నిర్వహణను ఏ శక్తి ఆపలేదని ఆమె ఆవేశంతో చెప్పారు. ఇదంతా రాజకీయ కుట్ర అని, రెండేళ్లలో ఈ స్కామ్ విషయంలో విచారణలు సాగిస్తున్నారు. డొంకలు కదిలిస్తున్నారు. కానీ ఒక్క పైసా కూడా పట్టుకోలేకపొయ్యారు. 500 మంది అధికారులు ఈ కేసులో తిరుగుతున్నారని , ఏం సాధించారని ప్రశ్నించారు. తమ పార్టీ తరఫున లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు.
అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేం : హైకోర్టు
అంతకుముందు కేజ్రీవాల్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం తెలిపింది. లిక్కర్ కేసులో తనకు సమన్లను సవాలు చేస్తూ కేజ్రీవాల్ పెట్టుకున్న ప్రధాన పిటిషన్ విచారణ ఏప్రిల్ 22న జరుగుతుంది. అరెస్టు విషయంలో పరిశీలనకు అప్పుడు వీలవుతుందని న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైత్, మనోజ్ జైన్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇరుపక్షాల వాదనలు వినడం జరిగిందని , ఇప్పటికైతే పిటిషనర్‌కు అరెస్టు నుంచి రక్షణ విషయంలో ఎటువంటి ఉత్తర్వు ఇవ్వడం లేదని , దీనిపై పిటిషనర్ జవాబు ఇచ్చుకోవచ్చునని ధర్మాసనం తెలిపింది. తనకు అరెస్టు నుంచి రక్షణ కావాలని కోరడం, సమన్లను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పరిధిలోకి వస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. గురువారం తమ ముందుకు రావాలని ఇడి కేజ్రీవాల్‌కు తొమ్మిదో సారి సమన్లు పంపించింది. ఇప్పటి సమన్లను నిలిపివేయాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు.