Saturday, June 29, 2024

లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు మరోషాక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను విచారించడానికి సీబీఐ అడిగిన ఐదు రోజుల కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మూడు రోజులు మాత్రమే అనుమతిచ్చింది. అంతేకాదు సిబిఐ మూడు రోజుల కస్టడీ సమయంలో కేజ్రీవాల్‌ను కలుసుకోడానికి ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌కు,అతని న్యాయవాదికి ప్రతిరోజూ 30 నిమిషాల పాటు అనుమతించింది. దీంతోపాటు కేజ్రీవాల్ సూచించిన మందులు, ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని అందించేందుకు కూడా కోర్టు వారికి అనుమతించింది. లిక్కర్ పాలసీ కేసులో మంగళవారం తీహార్ జైలులో కేజ్రీవాల్‌ను సిబిఐ విచారించింది.

బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసులో మరింత దర్యాప్తు చేసేందుకు కస్టడీ తీసుకునేందుకు అనుమతి కావాలని కోర్టులో దరఖాస్తు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు సిబిఐకి అనుమతించింది. ఈమేరకు జడ్జి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సిబిఐ అధికారులు కేజ్రీవాల్‌ను అదుపు లోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేశారు. పాలసీ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు సిబిఐ అడిగిన ఐదు రోజుల కస్టడీ కాకుండా మూడు రోజులు ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. ఈ మూడు రోజుల పాటు కేజ్రీవాల్ సిబిఐ కస్టడీలో ఉండనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News