Wednesday, January 22, 2025

9గంటలు ప్రశ్నల వర్షం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ లి క్కర్ పాలసీకి సంబంధించి సిబిఐ ఆదివారం విచారించింది. ఈ కేసులో ఆయనను ఏకం గా తొమ్మిది గంటల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ఓ సాక్షిగా విచారించిందని అధికారు లు తెలిపారు. లిక్కర్ లాబీకి ఉపయోగపడే పాలసీ రూపకల్పన వెనుక దాగి ఉన్న అవినీ తిని ఛేదించే క్రమంలో దర్యాప్తు సాగుతోందని, ఈ దిశలోనే ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్‌ను విచారించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ మంత్రిగా లఅంతకు ముందు బాధ్యతలలో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈ కేసుకు సంబంధించే గత నెలలో అరెస్టు చేశారు.

ఆయన బెయిల్ దొరకని స్థితిలో జైలులో ఉన్నప్పుడే కేజ్రీవాల్‌ను మద్యం పాలసీపై వివరాలు రాబట్టుకునేందుకు, అసలు ఏమి జరిగిందనేది తెలుసుకునేందుకు విచారణకు రప్పించారు. విచారణ జరుగుతున్న దశలోనే ఆప్ అత్యవసర సమావేశం జరిగింది. సాయంత్రం జరిగిన ఈ భేటీకి సీనియర్ నేతలు పలువురు హాజరయ్యారు. కేజ్రీవాల్ ఈ కేసులో విచారణ తరువాత అరెస్టు అయ్యే వీలుందని భయాందోళనలు వ్యక్తం కావడంతో పరిస్థితిని సమీక్షించుకునేందుకు ఈ సమావేశం జరిగింది. కేజ్రీవాల్ విచారణను నిరసిస్తూ ఆప్ నేతలు రాఘవ్ ఛద్ధా, సంజయ్ సింగ్‌లు సిబిఐ కార్యాలయం వద్దకు దూసుకువెళ్లుతూ ఉండగా వారిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బిజెపికి ఇప్పుడు కేజ్రీ ఫోబియా పట్టుకుందని , దీనితోనే ఆయనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, చివరికి జైలుకు పంపేందుకు యత్నిస్తోందని, జైలుకు వెళ్లేందుకు తాము భయపడేది లేదని, తప్పులు చేయని తాము తమ నేతలు భయపడే ప్రసక్తే లేదని ఆప్ కార్యకర్తలు తెలిపారు. కేజ్రీవాల్ నివాసంలోనే లిక్కర్ పాలసీ ముసాయిదా ప్రతి పరిశీలన జరిగిందని సిసోడియా అప్పటి సెక్రెటరీ దర్యాప్తు క్రమంలో చెప్పాడని. మార్చి 2021లో జరిగిన ఈ పరిణామం కేజ్రీవాల్ నివాసంలోనే జరిగిందని, అందుకే ఆయనను విచారించినట్లు సిబిఐ వర్గాలు తరువాత తెలిపాయి. అప్పటి సెక్రెటరీ బ్యూరోక్రట్ అయిన సి అరవింద్ మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఇందులోని అంశాలు చాలా కీలకమైనవని, ఉన్నతస్థాయిలో లోగుట్టుకు వీలుందని సిబిఐ భావించింది.

ఈ క్రమంలో అప్పటి సమావేశం వివరాలను కేజ్రీవాల్ నుంచి రాబట్టుకునేందుకు ఇప్పుడు ఆయనను విచారించినట్లు వెల్లడైంది. లిక్కర్ పాలసీపై అప్పట్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న అనిల్ బైజాల్ రెండు సార్లు అభ్యంతరాలు తెలిపి, బిల్లును పెండింగ్‌లో పెట్టిన తరువాత , ఎల్‌జి నుంచి దీనిపై దర్యాప్తునకు ఆదేశాలు వెలువడ్డ తరువాత పాలసీని ఎందుకు అనుమతించారనేది తేల్చుకోవల్సి ఉందని సిబిఐ నిర్ణయించింది.
రాత్రి 8.30 తరువాత నివాసానికి తిరిగివెళ్లిన కేజ్రీవాల్
ఉదయం 11 గంటల తరువాత కేజ్రీవాల్ సిబిఐ కార్యాలయానికి వెళ్లారు . మధ్యలో భోజనానికి విరామం ఇచ్చిన తరువాత తిరిగి సిబిఐ విచారణ ఆరంభించింది. రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో విచారణ ముగిసిందని సిబిఐ తెలిపింది. కొద్ది సేపటికి కేజ్రీవాల్ సిబిఐ కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చారు. తమ కారులో నివాసానికి బయలుదేరారు.
నేడు అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌కు ఆప్ పిలుపు
లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా వ్యతిరేకతతో వివాదం
అంతకు ముందు కేజ్రీవాల్‌ను సిబిఐ విచారిస్తున్న దశలోనే ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ఆప్ పిలుపు నిచ్చింది. ఈ ప్రతిపాదనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా తిరస్కరించారు. అసాధారణ రీతిలో ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఈ విధంగా సెషన్‌కు పిలుపు ఇవ్వడం ఎందుకు? అని లెఫ్టినెంట్ గవర్నర్ విస్మయం వ్యక్తం చేశారు. ఒక్కరోజు సమావేశానికి కేబినెట్ ప్రతిపాదించడం అనుచితం అని తెలిపారు. బడ్జెట్ విరామనాంతర సెషన్ కొనసాగింపునకు కేబినెట్ నిర్ణయించి ఉంటే అది వేరే విధంగా ఉండేదని, ఇతర కారణాలేవో ఉండటంతోనే ఒక్కరోజు సెషన్‌కు పిలిచినట్లుగా ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యానించారు.
56 ప్రశ్నలడిగారు ః కేజ్రీవాల్ వెల్లడి
తనను సుదీర్ఘ సమయం ప్రశ్నించారని, దాదాపుగా 56 ప్రశ్నలు వేశారని విచారణ తరువాత కేజ్రీవాల్ విలేకరులకు తెలిపారు. మరోసారి విచారణకు రావాలని ఆయనకు సిబిఐ నుంచి ఎటువంటి ఆదేశాలు వెలువడలేదని తెలిసింది. తనకు వేసిన 56ప్రశ్నలు బూటకంగా ఉన్నాయని, ప్రశ్నలు బూటకం, కేసు మరీ తప్పులతడక అని , తనపైనా తమ పార్టీ నేతలపైనా వారు ఎంతగా యత్నించినా ఏ తప్పు తెలియడం లేదని , ఇది వారి వైఖరితో తనకు తెలిసిన విషయం అని సిబిఐపై కేజ్రీవాల్ చురకలకు దిగారు. సెంట్రల్ ఢిల్లీలోని లోథీరోడ్‌లో ఉన్న సిబిఐ కార్యాలయం నుంచి ఆయన ఇంంటికి వచ్చిన తరువాత విలేకరులతో మాట్లాడారు.

2020లో లిక్కర్ పాలసీ అములోకి వచ్చిన నాటి నుంచి జరిగిన కథ అంతటిని వారు తరచితరచి అడిగారని, ఇప్పటి పరిణామాలను తాము ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ రేపు జరుగుతున్నందున అక్కడ తెలియచేస్తానని కేజ్రీవాల్ తెలిపారు. లిక్కర్ స్కామ్ అనేదే బూటకం, కేవలం దుష్ట రాజకీయాల వల్ల తలెత్తిన దుష్ప్రచారం అని కేజ్రీవాల్ తెలిపారు. వారికి ఆప్‌ను లేకుండా చేయాలనే తపన ఉందని, అయితే జనం మద్దతు ఉన్నందున ఇది వారికి సాధ్యం అయ్యే పనికాదని కేజ్రీవాల్ తెలిపారు.సిబిఐ వారు తమకు మంచి ఆతిధ్యమిచ్చినందున వారికి కృతజ్ఞతలు అని కేజ్రీవాల్ చెప్పారు. అంతా స్నేహసామరస్య పూరితంగా వ్యవహరించారని కితాబు ఇచ్చారు. కేజీవాల్ సిబిఐ కార్యాలయానికి రావడానికి ముందు నుంచే ఈ ప్రాంతం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

అంతకు ముందు కేజ్రీవాల్ ఓ ఐదు నిమిషాల వీడియో సందేశం వెలువరిస్తూ తనను అరెస్టు చేయాలని ఇప్పటికే బిజెపి సిబిఐ వర్గాలను ఆదేశించి ఉంటుందని, విచారణ తంతు తరువాత తాను అరెస్టు అయ్యి వెళ్లుతానేమో అని సందేశం వెలువరించారు. కేజ్రీవాల్ తన వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కొందరు కేబినెట్ సహచరులు రాగా సిబిఐ కార్యాలయానికి వెళ్లారు. ముందుగా రాజ్‌ఘాటుకు వెళ్లారు. అక్కడ మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రణామాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News