Thursday, January 23, 2025

అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం

- Advertisement -
- Advertisement -

Kejriwal congratulates Bhagwant Mann on sacking health minister

భగవంత్ మాన్‌కు కేజ్రీవాల్ అభినందనలు

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలపై తన క్యాబినెట్‌లోని ఆరోగ్య శాఖ మంత్రిని బర్తరఫ్ చేసినందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. అవినీతి వల్ల దేశానికి తీరని ద్రోహం జరుగుతోందని, దీన్ని తమ పార్టీ ఎంత మాత్రం ఉపేక్షించబోదని కేజ్రీవాల్ విలేకరులతో వర్చువల్‌గా మాట్లాడుతూ స్పష్టం చేశారు. నిజాయితీకి తమ పార్టీ మారుపేరని, అవినీతి కార్యకలాపాలను తమ పార్టీ సహించబోదని ఆయన తెలిపారు. అవినీతికి పాల్పడిన తమ పార్టీ నాయకులను సైతం వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. అవినీతికి పాల్పడిన తన మంత్రిని తక్షణమే తొలగించిన పంజాబ్ ముఖ్యమంత్రి మాన్‌ను చూసి గర్వపడుతున్నామని ఆయన అన్నారు. అవినీతికి పాల్పడడం దేశానికి నమ్మకద్రోహం చేయడంతో సమానమని, ప్రాణాలైనా అర్పిస్తాం కాని భారతమాతకు నమ్మకద్రోహం చేయబోమని కేజ్రీవాల్ ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News