Sunday, April 20, 2025

‘పుష్ప 2’ పాటకు కేజ్రీవాల్ స్టెప్పులు.. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. శుక్రవారం రాత్రి కేజ్రీవాల్ కూతరు హర్షిత వివాహం ఘనంగా జరిగింది. తన స్నేహితుడు సంభవ్‌ జైన్‌ని హర్షిత పెళ్లి చేసుకుంది.

అంతకుముందు, ఏప్రిల్ 18న జరిగిన నిశ్చితార్థం వేడుకలో తన భార్య సునీతాతో కలిసి కేజ్రీవాల్ డ్యాన్స్ వేశారు. పుష్ప 2 లోని ‘అంగారో కా అంబర్ సా’ పాటకు ఇద్దరు కలిసి చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కేజ్రీవాలే కాదు.. ఈ వేడుకకు హాజరైన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా తన స్టెప్పులతో రెచ్చిపోయారు. కాగా, కేజ్రీవాల్ కూతురు వివాహానికి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్‌ నేతలతపాటు పలువురు రాజకీయ నాయకులు, సన్నిహితులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News