Wednesday, January 22, 2025

కేజ్రివాల్‌కు ఎల్‌జి మరో షాక్

- Advertisement -
- Advertisement -

Kejriwal fires on Delhi Lieutenant Governor

ఢిల్లీ నూతన మద్యం విధానంపై సిబిఐ దర్యాప్తుకు సిఫార్సు
సిసోడియా పాత్రపైనా విచారణకు ఆదేశం
ఆయనను అరెస్టు చేస్తారని నాకు ముందే తెలుసు
కేసులకు మేం భయపడం: కేజ్రివాల్

న్యూఢిల్లీ: కేజ్రివాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్సైజ్ పాలసీ2022 నిబంధనలకు వ్యతిరేకంగా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో వాటిపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వికె సక్సేనా కేంద్ర దర్యాప్తు సంస ్థ(సిబిఐ)కు సిఫార్సు చేశారు. నూతన మద్య విధానంలో చోటు చేసుకున్న నిబంధనల ఉల్లంఘనలతో పాటుగా విధానపరమైన లోపాలపై దర్యాప్తు జరపాలని సూచించారు. మద్యం విధానంపై చీఫ్ సెక్రటరీ దాఖలు చేసిన నివేదికను చూస్తే జిఎస్‌సిటిడి యాక్ట్1991, ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్(టిఒబిఆర్)1993, ఢిల్లీ ఎక్సైజ్ యాక్ట్2009తో పాటు ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్2010 లను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని లెఫ్టెనెంట్ గవర్నర్ పేర్కొన్నారు. వీటితో పాటుగా టెండర్ల తర్వాత లైసెన్స్‌దారులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం విధానపరమైన లోపాలకు పాల్పడినట్లు కనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇన్‌చార్జిగా ఉన్న మనీశ్ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు.

మండిపడ్డ కేజ్రివాల్
రాష్ట్రప్రభుత్వ నూతన మద్యం విధానంపై సిబిఐ దర్యాప్తు చేయాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ సిఫార్సు చేయడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీవ్రంగా మండిపడ్డారు. మనీశ్ సిసోడియా తప్పుడు కేసులో అరెస్టయ్యే అవకాశం ఉందని తనకు కొద్ది నెలల ముందే తెలుసునని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విధులు నిర్వర్తించకుండా వారిపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేయిస్తోందంటూ మండిపడ్డారు.ఆమ్ ఆద్మీపార్టీ జాతీయ స్థాయికి ఎదుగుతుండడంతో కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.‘ ఆయనను(మనీశ్ సిసోడియా)అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ విషయం కొద్దినెలల క్రితమే నాకు తెలుసు. దేశంలో ఒక కొత్తపద్ధతి నడుస్తోంది. ఎవరిని జైలుకు పంపాలో, ఏ విధంగా ఇరికించాలో వారే( కేంద్రం) నిర్ణయిస్తారు’ అని అన్నారు. మనీశ్ సిసోడియా నిజాయితీపరుడని కేజ్రివాల్ కితాబిచ్చారు. ఇది పూర్తిగా తప్పుడు కేసని, సిసోడియా 22 ఏళ్లుగా తనకు తెలుసునని, ఎంతో నిజాయితీపరుడని ప్రశంసించారు. జైళ్లంటే తమకు భయం లేదని కేజ్రివాల్ అన్నారు. తమ నేతలపై ఎన్నో కేసులు బనాయించారని, ఆప్ ప్రతిష్ఠ అంతకంతకూ పెరుగుతుండడం, పంజాబ్‌లో అధికారంలోకి రావడం, జాతీయ స్థాయికి పార్టీ ఎదగడం చూసి వారు( కేంద్రం) ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, అయితే తమ ఎదుగుదలను ఎవరూ అపలేరని ధీమా వ్యక్తం చేశారు.

కేజ్రివాల్ అంటే మోడీకి భయం: సిసోడియా
కాగా ఎల్‌జి సిఫార్సులపై సిసోడియా ఒక ట్వీట్‌లో స్పందించారు.‘ మోడీజీకి కేజ్రివాల్ భయం పట్టుకుంది. ఆయనపై ప్రజలకున్న భ్రమలు తొలగిపోయాయి. యావద్దేశ ప్రజలు ఇప్పుడు ఒక్క కేజ్రివాల్‌పైనే ఆశలు పెట్టుకున్నారు’ అని అన్నారు. దేశవ్యాప్తంగా ఆప్‌కు ఆదరణ పెరుగుతోందని, అందువల్ల పార్టీపై మరిన్ని తప్పుడు కేసులు పెరగవచ్చన్నారు. ఏ కేసులు కూడా కేజ్రివాల్‌ను, ఆప్‌ను ఆపలేవన్నారు. కాగా కేంద్రంలోని బిజెపి నేతల ప్రోద్బలంతోనే లెఫ్టెనెంట్ గరన్నర్ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారని ఆప్ ముఖ్య అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మీడియా సమావేశంలో ఆరోపించారు. మనీలాండరింగ్ కేసులో కేజ్రివాల్ ప్రభుత్వంలో మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఇడి గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News