Sunday, November 3, 2024

ప్రధాని మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేజ్రీవాల్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా నేపథ్యంలో 2020లో తొలిసారి లాక్‌డౌన్ విధించిన సమయంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ కారణమయ్యిందంటూ ప్రధాని మోడీ సోమవారం లోక్‌సభలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ సర్కార్‌తోపాటు మహారాష్ట్రలో శివసేన కూడా వలస కార్మికులను స్వంత ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ ఆరోపణలను ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కొట్టిపారేశారు. వలస కార్మికుల తరలింపుపై ప్రధాని మోడీ అన్నీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడ్డ వారి పట్ల ప్రధాని మోడీ సున్నితంగా వ్యవహరించాలని దేశం ఆకాంక్షిస్తోందని, కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఫస్ట్‌వేవ్ సమయంలో ముంబైలో కాంగ్రెస్ నేతలు వలస కూలీలకు టికెట్లు ఇచ్చి సొంతూళ్లకు వెళ్లగొట్టారని, దీంతో కరోనా వ్యాప్తి జరిగినట్టు మోడీ ఆరోపించారు. ఢిల్లీలో కూడా ప్రజలు ఊళ్లకు వెళ్లేందుకు బస్సులను స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు ప్రధాని చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలు దురదృష్టకరమని, మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చాలాసాహబ్ థోరల్ ఆరోపించారు.

Kejriwal fires on PM’s statement on migrants exodus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News