Friday, December 20, 2024

కేజ్రీవాల్‌కు పెద్ద ఊరట.. ఎఫ్‌ఐఆర్‌ను తిరస్కరించిన గోవా కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు గోవా కోర్టు నుంచి ఊరట లభించింది. కేజ్రీవాల్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను గోవా కోర్టు శనివారం తిరస్కరించింది.2017 గోవా ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ అందరి దగ్గర డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం చీపురు గుర్తుకే వేయండి అని ఓటర్లకు సూచించడం వివాదానికి దారి తీసింది.

ఈ ప్రసంగానికి సంబంధించి గోవా పోలీస్ స్టేషన్‌లో కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రాతినిధ్య చట్టం, భారతీయ శిక్షాస్మృతి (ఐపీసి) సెక్షన్ 171 (ఇ) లంచానికి సంబంధించిన కేసు నమోదైంది. దీనిపై జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ నవంబర్‌లో ఆయనకు సమన్లు జారీ చేశారు. 2017,2022 లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ 2017లో ఒక్క సీటు కూడా గెలవలేక పోయినా, 2022లో మాత్రం రెండు సీట్లు గెలుచుకుంది. ఈ కేసు విచారణ దాదాపు 7 ఏళ్లు సాగింది. చివరికి శనివారం కీలక తీర్పు వివరిస్తూ ఎఫ్‌ఐఆర్‌ను గోవా కోర్టు తిరస్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News