Sunday, December 22, 2024

హర్యానాకు కేజ్రీవాల్ గ్యారంటీలు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో ఐదు ‘కేజ్రీవాల్ గ్యారంటీలు’ను ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ శనివారం ప్రారంభించారు. ప్రజలకు ఉచిత విద్యుత్తు, ఉచిత వైద్య చికిత్స, ఉచిత విద్య, ప్రతి మహిళకు నెలకు రూ. 1000, యువజనులకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఆమె వాగ్దానం చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. పంచ్‌కులలో ‘కేజ్రీవాల్ ఐదు గ్యారంటీలు’ వాగ్దాన కార్యక్రమంలో సునీత కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ సీనియర్ నేతలు సంజయ్ సింగ్.

సందీప్ పాఠక్ కూడా పాల్గొన్నారు. ఆప్ జాతీయ కన్వీనర్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఎక్సైజ్ పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ సందర్భంగా సభలో సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. హర్యానాలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు పోటీ చేయనున్నట్లు ఆప్ ఇదివరకే ప్రకటించింది. అయితే, హర్యానాలో పలు ఎన్నికల్లో ఆప్ పోటీ చేసినప్పటికీ అది రాష్ట్రంలో ఇంకా ఎన్నికల విజయం చూడవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News