Friday, November 22, 2024

గుజరాత్ సఫాయి కర్మచారికి కేజ్రీవాల్ ఇంటిలో విందు ఆతిధ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పంజాబ్‌లో అధికారాన్ని చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్‌లో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్న దృష్టా ఆప్ అధినేత కేజ్రీవాల్ బడుగు వర్గాలతోపాటు వివిధ సామాజిక వర్గాలను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఒక ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు చెందిన సఫాయి కర్మచారి (పారిశుద్ధ కార్మికుడు) కుటుంబానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీ లోని తన నివాసంలో విందు ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది . ఈ సందర్భంగా తన నివాసానికి వచ్చిన పారిశుద్ధ కార్మికుడు హర్ష్ సోలంకికి కేజ్రీవాల్ స్వాగతం పలికి ఆత్మీయతతో ఆలింగనం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు సోలంకి అంబేద్కర్ చిత్ర పటాన్ని బహూకరించారు. ఆ తరువాత కేజ్రీవాల్‌తో కలిసి సోలంకి కుటుంబ సభ్యులు భోజనం చేశారు.

ఈ విందులో ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా కూడా ఉన్నారు. అంతకు ముందు ఢిల్లీ విమానాశ్రయంలో సోలంకి కుటుంబానికి గుజరాత్ కో ఇన్‌ఛార్జి రాఘవ్ చద్దా స్వాగతం పలికారు. విందు అనంతరం హర్ష్ సోలంకి కుటుంబం ఢిల్లీ లోని ప్రభుత్వ పాఠశాల, ఆస్పత్రిని సందర్శించింది. ఆదివారం కేజ్రీవాల్ గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో పారిశుద్ధ కార్మికులతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను సోలంకి తన ఇంటికి విందుకు రావలసిందిగా ఆహ్వానించాడు. దీంతో కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీలోని తన ఇంటికి కుటుంబంతో సహా రావాలని ఆహ్వానించారు. కేజ్రీవాల్ ఆహ్వానంతో సోలంకి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటివరకు ఏ నేత ఇలా దళితులను తమ ఇంటికి విందుకు ఆహ్వానించలేదని ప్రశంసించాడు. విందు సమయంలో సోలంకి కన్నీళ్లు పెట్టుకోగా కేజ్రీవాల్ ఓదార్చి ఆ కుటుంబానికి జ్ఞాపిక అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kejriwal hosts lunch to Gujarat Sanitation worker’s family

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News