బెయిల్‌పై వచ్చినవారికి పూదండలు
లా న్యూఢిల్లీ : కేజ్రీవాల్ ఇంటిపై దాడి జరిపి జైలుపాలయి బెయిల్‌పై వచ్చిన మంది బిజెపి యువవ మోర్చా కార్యకర్తలను ఢిల్లీ బిజెపి అభినందించింది. వారు జైలు నుంచి బయటకు రాగానే జైలు ఆవరణలోనే ఈ యువకుడికి ఢిల్లీ బిజెపి అధ్యక్షులు అదేశ్ గుప్తా స్వాగత పలికారు. వారికి పూలదండలు వేసి సత్కరించారు. గత నెల 31వ తేదీన వీరు అరెస్టు అయ్యారు. హిందూ వ్యతిరేక శక్తులపై పోరులో ఈ బృందం ముందుంది. యాంటీ హిందూ అయిన కేజ్రీవాల్ ఇంటివద్ద విధ్వంసంతో శక్తిని చాటుకుందని, వీరిని తాము యువ విప్లవకారులుగా పేర్కొంటున్నామని గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ యువతను తాము ఇప్పుడు రాష్ట్ర బిజెపి కార్యాలయానికి సాదరంగా ఆహ్వానిస్తున్నామని , వీరు తమ చర్యలతో ఎందరికో స్ఫూర్తి ప్రదాతలు అయ్యారని, మన ప్రతి కార్యకర్త దేశంలోని హిందూ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ప్రతిక్షణం, అడుగడునా అణువణువునా సత్తా చాటుకోవల్సి ఉంటుంది. యువమోర్చాకు చెందిన ఈ యువ విప్లవకారులకు ఎల్లవేళలా బాసటగా ఉంటామని బిజెపి ఢిల్లీ విభాగం తెలిపింది.
గూండాలకు బిజెపి పూదండలా : ఆప్
బెయిల్‌పై వచ్చిన బిజెపి కార్యకర్తలకు బిజెపి పూలదండలు, అభినందనలు పార్టీలోని వింత వైఖరిని తెలియచేస్తున్నాయని ఢిల్లీ ఆమ్ ఆద్మీపార్టీ పేర్కొంది. దుండగులు తమకు నచ్చనివారిని ఎంచుకుని దాడికి దిగితే వారిపై ఆప్ దాడులు సాగించడం భావ్యం కాదని ఆప్ నేతలు స్పందించారు. ఇది ఎటువంటి సంకేతాలకు దారితీస్తుందని ప్రశ్నించారు.