Thursday, January 23, 2025

ఇంటి మరమ్మతు కోసం రూ. 45 కోట్లా? కేజ్రీవాల్ నిజాయితీ ఇదేనా 

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తన అధికారిక నివాసం మరమ్మతుల కోసం రూ.45 కోట్లు ఖర్చుచేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మహరాజ్‌గా బిజెపి బుధవారం అభివర్ణించింది. రాజకీయాలలోకి ప్రవేశించిన సమయంలో తనను తాను నిజాయితీకి, నిరాడంబరతకు నిరద్శనంగా చెప్పుకున్న కేజ్రీవాల్ తన ఇంటికోసం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చుచేయడాన్ని బట్టి తన సిద్ధాంతాలను కూడా మరమ్మతు చేసుకున్నట్లు అర్థమవుతోందని బిజెపి విమర్శించింది.

Also Read: కన్నడిగులను బెదిరిస్తున్న అమిత్ షా: జైరాం రమేష్

బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా బుధవారం విలేకరులతో మాట్లాడుతూ..ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను మహరాజ్‌గా అభివర్ణించారు. తన నివాసంలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన వస్తువులను సమకూర్చుకున్న కేజ్రీవాల్‌ను చూసిన రాజులు సైతం సలాం కొడతారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వార్తలు బయటకు పొక్కకుండా ఉండేందుకు మీడియా సంస్థలకు కేజ్రీవాల్ రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఎరచూపాడని, అయినప్పటికీ వారాచానళ్లు, వార్తాపత్రికలు ఆ ప్రతిపాదనను తిరస్కరించాయని పాత్రా తెలిపారు.

Also Read: మెట్రోలో రీల్స్ వద్దంటూ ఢిల్లీ మెట్రో చురకలు

కేజ్రీవాల్ తన ఇంటి కోసం కొనుగోలు చేసిన ఎనిమిది కర్టెన్లలో ఒక దాని విలువ రూ.7.94 లక్షలని, అన్నిటి కన్నా చవకైన కర్టెన్ ఖరీదు రూ.3.57 లక్షలని పాత్రా చెప్పారు. ఇందుకు సంబంధించిన పత్రాలను పాత్రా మీడియా ప్రతినిధులకు చూపిస్తూ రూ.1.15 కోట్ల విలువైన పాలరాతిని వియత్నాం నుంచి కొనుగోలు చేశారని, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ చెక్క గోడల కోసం రూ. 4 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోడీని ఎద్దేవా చేస్తూ ఒక రాజు కథ చెప్పిన కేజ్రీవాల్‌ను ప్రస్తావిస్తూ ఇదీ సిగ్గులేని ఒక రాజు కథ అంటూ పాత్రా విమర్శించారు.

Also Read: లైంగికంగా వేధించిన ర్యాపిడో రైడర్… బైక్ పైనుంచి దూకిన యువతి

ఇది ఇంటి మరమ్మతులకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఆప్ నాయకుల ఆలోచనాధోరణి, వారి సిద్ధాంతాలకు సంబంధించిన వ్యవహారమని సంబిత్ పాత్రా అన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలలోకి వచ్చిన తొలి నాళ్లలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రసంగాలను ఆయన విలేకరల సమావేశంలో ప్రదర్శించారు. అధికారంలో ఉన్న నాయకులకు ఇచ్చే భారీ బంగళాలు, ఇతర సౌకర్యాలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఆయన విలేకరులకు వినిపించారు. నాలుగైదు గదులున్న ఇల్లు తనకు ఉందని, తనకు పెద్ద ఇల్లు అవసరం లేదని కేజ్రీవాల్ అనడం వినిపించింది.
తాను చేసిన ఆరోపణలకు కేజ్రీవాల్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి సమాధానమివ్వాలని పాత్రా డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News