Saturday, February 8, 2025

కేజ్రీవాల్ ను నమ్మని ఢిల్లీ ప్రజలు.. ఘోర ఓటమి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రజలు భారీ షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపొంది.. మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న కేజ్రీవాల్ కు ఊహించని దెబ్బ కొట్టారు ఢిల్లీ ప్రజలు. అధికారంలోకి రావడం అటుంచితే.. అసలు ఎమ్మెల్యేగా కూడా కేజ్రీవాల్ ను గెలిపించలేదు. కేజ్రీవాల్ తోపాటు ఆ పార్టీ అగ్రనేత మనీశ్ సిసోదియా కూడా ఓడిపోయారు.  ఇక, ఆ పార్టీ కేవలం 21 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఢిల్లీలో ఈసారి బిజెపి జెండా ఎగరబోతోందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News