Sunday, December 22, 2024

ఆప్ మిషన్ గుజరాత్

- Advertisement -
- Advertisement -
Kejriwal Mann visit Sabarmati Ashram
సబర్మతి ఆశ్రమానికి కేజ్రీ, మాన్

అహ్మదాబాద్ : ఈఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్‌పై ఆమ్ ఆద్మీపార్టీ దృష్టి సారించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్‌తో కలిసి శనివారం గుజరాత్‌కు వచ్చారు. గాంధీజి స్మారకచిహ్నం అయిన సబర్మతీ ఆశ్రమాన్ని ఈ ఇరువురూ సందర్శించారు. శుక్రవారం రాత్రి ఇక్కడికి చేరిన ఇరు రాష్ట్రాల సిఎంలు తెల్లవారుజామునే ఆశ్రమానికి వెళ్లారు. తొలుత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. తరువాత ఆశ్రమంలో బాపు ఎక్కువగా గడిపిన హృదయ్‌కుంజ్‌కు వెళ్లారు. అక్కడి మ్యూజియంలను సందర్శించారు. గాంధీకి అత్యంత ఇష్టమైన చరఖాపై నూలు వడికారు.

కేజ్రీవాల్ , మాన్ ఆ తరువాత అక్కడి సందర్శకుల పుస్తకంలో తమ అనుభవాలను పొందుపర్చారు. ఆశ్రమ అధికారులు ఇద్దరు నేతలకు చరఖా ప్రతిమ, గాంధీజి పుస్తకాలను కొన్నింటిని బహుకరించారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రిని అయిన తరువాత సబర్మతి ఆశ్రమానికి రావడం ఇదే తొలిసారి అని కేజ్రీవాల్ విలేకరులకు తెలిపారు. అంతకు ముందు తరచూ ఇక్కడికి వచ్చేవాడినని ఇక్కడికి వస్తే చెప్పలేని మానసిక అంతర్గత ప్రశాంతత దక్కుతుందని సంతోషం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో ఆప్ నేతలు రెండు కిలోమీటర్ల పరిధిలో రోడ్ షో సాగించారని ఆప్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. కేజ్రీవాల్ తమ వెంట మాన్‌తో గుజరాత్‌కు రావడాన్ని రాజకీయ వర్గాలు మిషన్ గుజరాత్‌గా పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News