Monday, December 23, 2024

ఖర్గే, రాహుల్‌తో భేటీకి సమయం కోరిన కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వంలో ఐఎఎస్ అధికారుల నియామకాల అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్రతిపక్షాల మద్దతును కూడగడుతున్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీతో భేటీకి సమయం కోరారు. బిజెపి ప్రభుత్వం జారీ చేసిన అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మద్దతును కోరేందుకు కాంగ్రెస్ అద్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీని సమయం కోరినట్లు ట్విటర్ వేదికగా కేజ్రీవాల్ వెల్లడించారు.

Also Read: వధువు ముస్తాబులో పరీక్ష హాలుకు(వైరల్ వీడియో)

గురువారం ముంబైలో ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌ను కలుసుకున్న కేజ్రీవాల్ ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతును కోరారు. బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి తనఅధికారాలను కాపాడేందుకు ఆప్‌కు సంపూర్ణ సహకారాన్ని ఇస్తామని పవార్ ప్రకటించారు. అందుకు ముందు రోజు కేజ్రీవాల్ శివసేన అధ్యక్షుడు(యుబిటివర్గం), మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను కలుసుకుని ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మద్దతు కోరారు.

ఢిల్లీ ప్రభుత్వంలో బ్యూరోక్రాట్ల నియామకానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఈ నిర్ణయానికి విరుద్ధంగా అధికారుల నియామకాల అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగిస్తూ ఒక ర్డానెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకోవడానికి కేజ్రీవాల్ ప్రతిపక్షాల మద్దతును కూడగడుతున్నారు. ఇప్పటికే బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఆప్‌కు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News