Tuesday, December 24, 2024

ఢిల్లీలో 80 శాతం కట్టడాలు ఆక్రమణలే: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

కూల్చివేతలపై బిజెపిపై కేజ్రీవాల్ ఆగ్రహం

Kejriwal meets Delhi MLAs to discuss countering ‘bulldozer politics’

న్యూఢిల్లీ : ఢిల్లీలో కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి ధ్వజమెత్తారు. ఢిల్లీలో 80 శాతం కట్టడాలు ఆక్రమణలే అన్న ఆయన వాటన్నింటినీ కూల్చేస్తే దేశం లోనే అతిపెద్ద విధ్వంసం ఇదే అవుతుందని బీజేపీపై మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్‌ఎల్‌ఎలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వం లోని మున్సిపల్ కార్పొరేషన్లను ఉద్దేశిస్తూ దుకాణాలు, ఇళ్లను కూల్చివేయడానికి వారు బుల్డోజర్లతో కాలనీలకు వస్తున్నారు. కనీసం ఎలాంటి పత్రాలు చెక్ చేయకుండా నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.

ఢిల్లీని ఓ ప్రణాళిక ప్రకారం నిర్మించలేదు. ఇక్కడ 80 శాతానికి పైగా ఉన్న కట్టడాలు ఆక్రమణలే అని చెప్పొచ్చు. దానర్థం 80 శాతం ఢిల్లీని మీరు ధ్వంసం చేయబోతున్నారా ? అక్రమ కట్టడాల కూల్చివేతల్లో మున్సిపల్ అధికారులు చేపడుతున్న చర్యలు సరికాదు. దాదాపు 50 లక్షల మంది ప్రజలు అనధికారిక కాలనీల్లో , 10 లక్షల మంది జుగ్గీల్లో నివాసం ఉంటున్నారు. అంటే 60 లక్షలకు పైగా ప్రజల ఇళ్లు , దుకాణాలను మీరు బుల్డోజర్లతో కూల్చేయనున్నారా ? అదే జరిగితే స్వతంత్ర భారతంలో ఇదే అతిపెద్ద వినాశనం కానుంది అని కేజ్రీవాల్ బిజెపిపై మండిపడ్డారు.

బీజేపీ కక్షపూరితంగా చేస్తోన్న ఈ అక్రమ కట్టడాల కూల్చివేతను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్‌ఎల్‌ఎలు అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లేందుకు కూడా వెనుకాడొద్దని చెప్పారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ కచ్చితంగా విజయం సాధిస్తుందని , అప్పుడు ఈ ఆక్రమణల సమస్యను పరిష్కరిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. అనధికారిక కాలనీల్లో ఉంటున్న వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News