Sunday, January 19, 2025

జైళ్లు నన్ను బంధించలేవు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

‘ఏ జైలూ నన్ను ఎంతోకాలం బంధించి ఉంచలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు త్వరలోనే బయటకు వస్తా’నని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైలులో ఉన్న కేజ్రీవాల్ తన భార్య సునీత ద్వారా ఓ సందేశాన్ని పంపించారు. ఆమె ఒక వీడియోలో కేజ్రీవాల్ సందేశాన్ని చదివి వినిపించారు. ‘కస్టడీలో ఉన్న మీ కుమారుడు, సోదరుడు కేజ్రీవాల్ ఈ సందేశాన్ని పంపించారు’ అని ఆమె చెప్పారు.

కేజ్రీవాల్ సందేశంలో ఏం చెప్పారంటే” నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను జైలులో ఉన్నా లేకున్నా దేశానికి సేవ చేస్తూనే ఉంటా. నా జీవితం ఈ దేశానికి అంకితం. నా ప్రతి రక్తపు బొట్టు ఈ దేశానికి అంకితం. నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూశాను. ఇది ఇలాగే కొనసాగుతుందని నాకు తెలుసు. కాబట్టి ఈ అరెస్టు నాకేం ఆశ్చర్యం కలిగించలేదు. కేజ్రీవాల్ జైలుకు వెళ్లాడు కాబట్టి బడ్జెట్లో ఇచ్చిన హామీ మేరకు తమకు రూ.1000 అందుతాయో లేదోనని ఢిల్లీ మహిళలు అనుకుంటూ ఉండవచ్చు. నన్ను ఏ జైలూ ఎంతోకాలం బంధించి ఉంచలేదు. నేనిచ్చిన హామీలు నెరవేర్చేందుకు త్వరలోనే బయటకు వస్తా’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను జైలులో ఉన్నా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన ఆప్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News