Sunday, December 22, 2024

సిబిఐ అరెస్టుపై హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో సిబిఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక తనను మూడు రోజుల సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ జూన్ 26న ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా కేజ్రీవాల్ సవాలు చేశారు.

జులై 12 వరకు కేజ్రీవాల్‌కు జుడిషియల్ కస్డటీ విధిస్తూ జూన్ 29న ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఎన్సైజ్ పాలసీ కేసుతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంతో జుడిషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సిబిఐ తీహార్ జైలులో అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News