Sunday, January 19, 2025

సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిఎం కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరో వారం రోజుల పాటు జూన్ 7 వరకు తన మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా వైద్య పరీక్షల కోసం కేజ్రీవాల్ గడువు కోరినట్లు తెలుస్తోంది.

బరువు తగ్గడం, కీటోన్ లెవెల్స్ పెరగడంతో పెట్ సిట్ స్కాన్ చేయించుకోవాల్సి ఉందని ఆయన పిటిషన్ లో తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగా, జూన్ 1వరకు ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News