Tuesday, March 4, 2025

కేజ్రీ వ్యూహం మారితేనే మునుపటి క్రేజ్!

- Advertisement -
- Advertisement -

ఈ ఎన్నికలలో ఓడించినంత మాత్రాన జాతీయ రాజకీయాలలో కేజ్రీవాల్ ఉనికిని ధ్వంసం చేశామనుకొంటే పొరపాటే కాగలదు. భారత రాజకీయ చరిత్రలోనే కుల బలం లేదా రాజకీయ వారసత్వ అండదండలు లేదా సినీ గ్లామర్ లేకుండా సామాన్య వ్యక్తిగా ఢిల్లీ మురికివాడల నుండి తన ప్రజాజీవనం ప్రారంభించి పుష్కరకాలం పాటు ఢిల్లీలో అధికారంలో ఉండటం ద్వారా కేజ్రీవాల్ ఓ చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సామెత చెబుతుండేవారు. పీవీజీ రాజు అధికారంలో ఉంటే, మర్రి చెన్నారెడ్డి ప్రతిపక్షంలో ఉంటె ప్రమాదమని కాంగ్రెస్ అదిష్ఠా నం భావించేది. అందుకనే పీవీజీ రాజు నాటి ప్రధాని పండిట్ నెహ్రుతో తలపడగల నేత అయినప్పటికీ పీవీజీ రాజును పదవులకు చాలావరకు దూరంగా ఉంచేవారు. కేంద్రం లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా త్రం చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేవారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి దించి నా గవర్నర్ పదవిలో ఉంచేవారు గానీ ఖాళీగా ఉండనిచ్చేవారు కాదు. అదేవిధంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు పార్లమెంటులో ఉన్న సంఖ్యాబలం చెప్పుకోదగినది కానప్పటికీ అయన ఉనికి చూస్తేనే ప్రధాన జాతీ య పక్షాలైన బిజెపి, కాంగ్రెస్ భయపడుతున్నాయి.

ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేదనుకున్న కేజ్రీవాల్ ను పట్టుబట్టి ఈ రెండు పక్షాలు ఓడించాయి. అందుకోసం 27 ఏళ్ళ తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చేందుకు పరోక్షంగా కాంగ్రెస్ సహకరించింది. వరుసగా మూడోసారి ఒక్క ఎమ్యెల్యే సీటు గెలవలేక పోయినా ఆప్‌కు అధికారం దక్కక పోవడంతో కాంగ్రెస్ సంబరాలు చేసుకున్నట్లు కనిపిస్తున్నది. ఓ కార్పొరేషన్ మేయర్‌కు మించిన అధికారాలు లేని అలంకారప్రాయమైన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిలో ఆప్ ప్రతినిధి ఉండడాన్ని ఈ రెండు పార్టీలు సహింపలేక పోవడం చూస్తుంటే కేజ్రీవాల్ ఉనికి పట్ల వారిలో నెలకొన్న భయాందోళనలు వెల్లడి అవుతున్నాయి. అయితే ఈ ఎన్నికలలో ఓడించినంత మాత్రాన జాతీయ రాజకీయాలలో కేజ్రీవాల్ ఉనికిని ధ్వంసం చేశామనుకొంటే పొరపాటే కాగలదు. భారత రాజకీయ చరిత్రలోనే కుల బలం లేదా రాజకీయ వారసత్వ అండదండలు లేదా సినీ గ్లా మర్ లేకుండా సామాన్య వ్యక్తిగా ఢిల్లీ మురికివాడల నుండి తన ప్రజాజీవనం ప్రారంభించి పుష్కరకాలం పాటు ఢిల్లీలో అధికారంలో ఉండటం ద్వారా కేజ్రీవాల్ ఓ చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు.

పైగా గుర్తింపు పొందిన ఆరు జాతీయ పార్టీలలో ఒకటిగా ఆప్‌కు గుర్తిం పు తెచ్చుకోగలిగారు. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వం టి నేతలతో పాటు వందేళ్ల చరిత్ర గల సిపిఐ సహితం ఈ విషయంలో విఫలమయ్యాయి. సాంప్రదాయకంగా ఢిల్లీ ద్విముఖ రాజకీయ చిత్రాన్ని త్రిముఖంగా మార్చడం ద్వారా కేజ్రీవాల్ రాజధాని రాజకీయాల గతిశీలతను మార్చారు. ఢిల్లీ ప్రయోగాన్ని ఇతరత్రా పునరావృతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పంజాబ్‌లో విజ యం సాధించారు. గత వారంలోనే గుజరాత్ లో ఆప్ 30 మునిసిపల్ సీట్లను గెలుచుకుంది. సాంప్రదాయ పార్టీలు, స్వార్థ ప్రయోజనాల నుండి మార్పు కోరుకునే వారికి ప్రత్యామ్నాయ వేదికగా ఆప్‌ను మార్చగలిగారు. నిజానికి, కేజ్రీవాల్ ఎదుర్కొన్న ప్రభుత్వ వ్యతిరేకత, ఇతర లోపాలను పరిగణనలోకి తీసుకుంటే, ఢిల్లీ ఎన్నికలలో ఆప్ పనితీరు కొట్టిపారవేయగలిగింది కాదు. ఆప్ 22 సీట్లతో పోలి స్తే బీజేపీ 48 సీట్లతో ముందంజలో ఉన్నప్పటికీ, ఓట్ల శాతంలో తేడా కేవలం 2.06% మాత్రమే. 14 నియోజకవర్గాల్లో, బీజేపీ విజయంలో స్వల్ప తేడా కాంగ్రెస్ అభ్యర్థులు పోలైన ఓట్ల కంటే తక్కువగా ఉంది. సమాజంలోని అత్యంత పేద వర్గాలలో, తక్కువ ఆదాయ మహిళా ఓటర్లలో ఆప్ తన పట్టును నిలుపుకుందని సీఎస్ డీఎస్ సర్వే సూ చించింది.

ఆ పార్టీ సాధారణ కుల కార్డును కాకుండా ఉచితాల తో అణగారిన ఓటర్లను ఆకర్షించడంపై దృష్టి పెట్టింది. ఉదాహరణ కు, కేజ్రీవాల్ తన సామాజిక వర్గం కారణంగా రాజకీయం గా పెద్దగా ప్రయోజనం పొందలేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ అపూర్వమైన పెరుగుదల భారత రాజకీయాల్లో అపూర్వమైనది. బీహార్‌లో కొత్త పార్టీని స్థాపించిన పోల్‌స్టర్ ప్రశాం త్ కిషోర్‌తో సహా ఆశావహ రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. పెద్దగా ఎవ్వరికీ తెలియని ఓ చిన్న ఎన్జీ ఓ కార్యకర్త అయిన కేజ్రీవాల్ కొత్త పార్టీని స్థాపించడం, కేవలం 13 నెలల్లోనే ముఖ్యమంత్రిగా కావడం విచిత్రమే. పైగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఓడించారు. ఎన్టీ రామారావు, ఎంజీ రామచంద్రన్ వంటి వారు రాత్రికి రాత్రే కీలక రాజకీయ నాయకులుగా మారినా వారికి ఘనమైన పూర్వరంగం, ప్రజలలో పలుకుబడి ఉన్నాయి.

అవేమీ లేకుండా 2011లో, యుపిఎ ప్రభుత్వం లో పెద్ద అవినీతి కుంభకోణాలను, 2012లో దిగ్భ్రాంతికరమై న నిర్భయ అత్యాచార కేసు సందర్భంగా పెబుల్లికిన ప్రజాగ్రహావేశాలను అదనుగా మార్చుకున్నారు. వాస్తవానికి ఢిల్లీలో ప్రారంభమైన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని పనిచేస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ రామ్‌దేవ్‌ను ఆసరాగా చేసుకుని, జంతర్ మంతర్ వద్ద జనసమూహా న్ని పెంచే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో మహారాష్ట్రకు పరిమితమైన అన్నాహజారేను తీసుకొచ్చి అవినీతి వ్యతిరేక జాతీయ ఉద్యమంగా మలచిన ఘనత కేజ్రీవాల్‌కే దక్కుతుంది. ఈ ఉద్యమంలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, కిరణ్ బేడీ వంటివారు చేరినా వారెవ్వరికి ప్రజలను సమీకరించే సామర్థ్యం లేదు. చివరికి ఈ ఉద్యమాన్ని ఓ రాజకీయ పార్టీగా మలచి రాజకీయాల పట్ల విసుగుచెందుతున్న ప్రజలకు ఓ నూతన ఆశాజ్యోతిగా కేజ్రీవాల్ నిలిచారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మొదటిసారి ఢిల్లీ అసెంబ్లీలో పెద్ద పార్టీగా అవతరించిన ఆప్ కు కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రిగా చేసేందుకు బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది.

ఇప్పుడు అదే కాంగ్రెస్ కేజ్రీవాల్‌ను అధికారంపై దూరం చేసేందుకు పరోక్షంగా బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు దోహదపడింది. ఈ విధంగా చేయడం ద్వారా ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్ తనను తాను బలహీన పరుచుకునేందుకు కారణమైంది. యాదృచ్ఛికంగా, కాంగ్రెస్ గతం లో ఉత్తరప్రదేశ్‌లో కూడా అదే తప్పు చేసింది. మాయావతికి మద్దతు ఇవ్వడం తో ఆమె కాంగ్రెస్ ఎస్సీ ఓటు బ్యాంకును మింగేసింది. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్‌కు బలమైన ఓట్లు ఎక్కువగా గతంలో కాంగ్రెస్ ఓట్లు కావడం గమనార్హం. పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తున్న విశ్వాసపాత్రులకు ప్రతిఫలమివ్వడానికి బదులుగా, ధనవంతులకు, వ్యాపారవేత్తలకు రాజ్యసభ సీట్లు ఇవ్వడం ఆయన చెప్పే రాజకీయాలకు, ఆచరణకు మధ్య అంతులేని అగాధం ఏర్పడినట్లు అయింది.

దాదాపు కీలక నేతలు అందరూ ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులుగా మారడంతో అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడుగా ఆయన మరిక ప్రజల ముందు నిలబడలేని పరిస్థితులు నెలకొన్నాయి. పంజాబ్‌లో ఏర్పడిన ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి నియంత్రించేందుకు మొద టి నుండి చేస్తున్న ప్రయత్నాలు సహితం అక్కడ సొంత పార్టీలో అస్థిరత్వంకు దారితీసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఢిల్లీ, పంజాబ్ తర్వాత ఇప్పటికే హర్యానా, గుజరాత్, గోవాలలో కొంత ప్రభావం చూపుతున్న ఆయన ప్రస్తు తం రాజస్థాన్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నా రు. రాబోయే రోజులలో కేజ్రీవాల్ వేసే ఎత్తుగడలను బిజెపి, కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు ఆసక్తితో గమనించాల్సిన అవసరం ఉంది. అన్నింటికీ మిం చి కాంగ్రెస్ లేకుండా బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలు చేసే ప్రయత్నాలకు కేజ్రీవాల్ ఓ బలమైన అండగా మారే అవకాశం ఉంది.

చలసాని నరేంద్ర
98495 69050

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News