Thursday, December 19, 2024

కేజ్రీవాల్ కు తగిన శాస్తి జరిగిందన్న మాజీ రాష్ట్రపతి కుమార్తె

- Advertisement -
- Advertisement -

ఆమె ఒక మాజీ రాష్ట్రపతి కుమార్తె. పైగా కాంగ్రెస్ నాయకురాలు. కేజ్రీవాల్ ను ఇడి అధికారులు అరెస్ట్ చేసినందుకు సంతోషించే వారిలో ఆమె ముందువరసలో ఉన్నారు. కేజ్రీవాల్ కు తగిన శాస్తి జరిగిందంటూ ఆమె సంబరపడుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే… మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ పనిచేస్తున్నప్పుడు ఆమెపై కేజ్రీవాల్ నోరు పారేసుకున్నారట. అందుకనే శర్మిష్ఠకు అంత కోపం. ‘షీలా దీక్షిత్ పై గతంలో కేజ్రీవాల్ నిరాధారమైన, బాధ్యతారహితమైన ఆరోపణలు చేశారు. ఆ కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు’ అంటూ ఎక్స్ (ట్విటర్)లో ఆగ్రహం వ్యక్తం చేశారు. షీలా దీక్షిత్ కు వ్యతిరేకంగా తన వద్ద బోలెడు సాక్ష్యాలున్నాయని చెప్పిన కేజ్రీవాల్, ఇప్పటివరకూ ఒక్క సాక్ష్యాన్ని కూడా ఇవ్వలేకపోయారని ఆమె ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News