- Advertisement -
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు. ఈ క్రమంలో పార్టీ ఓటమిపై ఆయన స్పందించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానన్నారు. విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపారు. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ప్రజల ఆకాంక్షలను ఆ పార్టీ నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు.
“ప్రజా తీర్పును స్వాగతిస్తున్నా. విజయం సాధించిన బీజేపీకి అభినందనలు. ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చాలని కోరుతున్నా. బీజేపీ గూండాగిరిని ఎదుర్కొని మేము పోరాడాం. ఢిల్లీ ప్రజల సమస్యలపై మా పోరాటం కొనసాగుతుంది” అని ఢిల్లీ సీఎం అతిషీ పేర్కొన్నారు. కాగా, ఆమె స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.
- Advertisement -