Monday, December 23, 2024

దేశం కోసం జైలుకు : కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

లిక్కర్ స్కామ్‌లో తమ డిప్యూటీని సిబిఐ విచారించేందుకు పిలిపించి అరెస్టు చేయడంపై సిఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆయనపై పెట్టినవి అన్ని తప్పుడు ఆరోపణలు అన్నారు. దేశంకోసం, సమాజం కోసం జైలుకు వెళ్లడం పాపం కాదని, గర్వకారణం అని స్పందించారు. ఢిల్లీ పిల్లలు వారి తల్లిదండ్రులు తామంతా ఆయనకు అండగా ఉంటామని, జైలు నుంచి ఆయన త్వరగా తిరిగి రావాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

పంజాబ్ సిఎం భగవంత్ మాన్ ఓ ప్రకటన వెలువరించారు. తాము సత్యపోరాటంలో ఉన్నామని, దేశం అంతా ఆయనకు తోడుగా ఉందని తెలిపారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకువచ్చి, పేద పిల్లలకు సముచిత ప్రామాణిక విద్యను అందించిన వ్యక్తికి తోడుగా తామంతా ఉన్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News