Friday, December 20, 2024

జైలునుంచే కేజ్రీవాల్ విధుల నిర్వహణ.. సాధ్యమేనా?

- Advertisement -
- Advertisement -

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  జైలునుంచే పాలన సాగిస్తారని, సీఎం విధులు నిర్వహిస్తారని ఆమ్ ఆద్మీపార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన జైలు నుంచి విధులు నిర్వహించకుండా నిరోధించే చట్టం ఏదీ లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఎంతవరకూ సాధ్యం అన్నది ప్రశ్నార్థకం.

గతంలో దాణా కుంభకోణంలో  లాలూ ప్రసాద్ అరెస్ట్ అయినప్పుడు  తన భార్య రబ్రీదేవికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి జైలుకు వెళ్లారు. భూ కుంభకోణం లో అరెస్ట్ అయిన ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా పదవికి రాజీనామా చేశారు. కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయకపోవడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న అంశంపై చర్చ సాగుతోంది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ కూడా న్యాయ నిపుణులతో ఈ అంశంపై సంప్రదింపులు జరుపుతోంది. అయితే కేజ్రీవాల్ పబ్లిక్ సర్వెంట్ కాబట్టి కేంద్రం ఆయనను సస్పెండ్ చేయవచ్చునని  న్యాయనిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా  ప్రభుత్వాధికారులు అరెస్ట్ అయిప్పుడు ఇదే పద్ధతిని అనుసరిస్తారు. రాష్ట్రపతి సీఎంను తొలగించే, సస్పెండ్ చేసే ఆధికారాలు ఉంటాయి.

గతంలో జైలునుంచి పాలన సాగించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. తాము జైలు మాన్యువల్ ప్రకారం వ్యవహరిస్తామని జైలు అధికారులు అంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇంతవరకూ ఆప్ ముఖ్యనేతలు.. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ..  కేజ్రీవాల్  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు  నిర్ణయంతో ఈ చిక్కుముడి వీడుతుందని ఆశించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News