Thursday, December 19, 2024

హర్యానాలోనూ పంజాబ్ లాంటి పెద్ద రాజకీయ తుఫాన్: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: హర్యానాలో కూడా పంజాబ్ లాంటి పెద్ద ‘రాజకీయ తుఫాన్’ వస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. దీనివల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఇది వారి మంచి కోసమేనని అన్నారు. హర్యానాలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కురుక్షేత్రంలో ఆదివారం ఆ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడారు. హర్యానాలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఇక్కడి పిల్లలకు ఉద్యోగాలు కల్పించదని, నిరుద్యోగులైన గుండాలు వారికి కావాలని విమర్శించారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. హర్యానా లోని అన్ని పాఠశాలలను నేను మెరుగుపరుస్తాను. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు దీనికి నిదర్శనం. పేదల పిల్లలు కూడా ఇంజినీర్లు, వైద్యులు అవుతారు అని అన్నారు. అలాగే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు నిరసనలు సాగించి కేంద్ర ప్రభుత్వం వాటిని వెనక్కు తీసుకునేలా పోరాడిన హర్యానా రైతులను ఆయన అభినందించారు.

Kejriwal Says Big Political Storm like Punjab in Haryana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News