Wednesday, January 22, 2025

కేజ్రీసభ… మోడీ హైజాక్

- Advertisement -
- Advertisement -

Kejriwal skips tree plantation event as Centre ‘hijacked’ AAP's event

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమం సిఎం అరవింద్ కేజ్రీవాల్ రాకుండానే జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా సీటుకు పక్కన సిఎం కుర్సీ ఖాళీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమం ముగింపు ఘట్టం ఆదివారం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కేంద్రం రాజకీయ దూకుడుతో హైజాక్ చేసిందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ విమర్శించారు. లక్ష మొక్కలు నాటే లక్షంతో ఈ నెల 11న వనమహోత్సవ కార్యక్రమం చేపట్టారు. ముగింపు సభ స్థానిక అసోలా వన్యప్రాణి కేంద్రంలో జరగాలి. గవర్నర్ ,సిఎం ఇతర నేతలు హాజరుకావల్సిన ఈ కార్యక్రమ ప్రచార పోస్టర్లను తొలుత సిఎం కేజ్రీవాల్ ఫోటోలతో ముద్రించి కూడళ్లలో ఏర్పాటు చేశారు. అయితే అర్థరాత్రి తరువాత పోలిసుబలగాలు వచ్చి వీటిన తీసివేశారని, పలు చోట్ల మొక్కలను నాటండనే ప్రచారంతో మోడీ ఫోటోల పోస్టర్లను ఏర్పాటు చేశారని మంత్రి విమర్శించారు.

చెట్ల పెంపకపు ఈ కార్యక్రమం రాజకీయవివాదానికి దారితీయడం ఇష్టం లేక సిఎం కేజ్రీవాల్, తాను సభకు వెళ్లలేదని రాయ్ వివరించారు. వేదికపై కేజ్రీవాల్ కుర్చీ ఖాళీగా ఉండటం కేంద్రంలోని బిజెపి సాగించిన సభా హైజాక్ అని పర్యాటక మంత్రి విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యపు సభను ఏదోవిధంగా దెబ్బతీయాలని, మోడీ పోస్టర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని ఢిల్లీ అధికారులకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి రాత్రికి రాత్రి ఆదేశాలు అందాయని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వ సభ చివరికి ఈ విధంగా రాజకీయమయం అయ్యి మరింత ముదరకుండా ఉండేందుకు తాను సిఎం కేజ్రీవాల్ ఈ సభకు వెళ్లలేదని పర్యావరణ మంత్రి వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News