Sunday, December 22, 2024

కపిల్ సిబాల్ కొత్త వేదిక ఇన్‌సాఫ్ కు కేజ్రీవాల్ మద్దతు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యుడు, న్యాయవాది కపిల్ సిబాల్ ఏర్పాటు చేసిన ఇన్‌సాఫ్ వేదికకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన మద్దతు తెలియజేశారు. అన్యాయంపై పోరాటానికి ప్రతి ఒక్కరూ ఈ వేదికలో చేరాలని ఆయన అభ్యర్థించారు. దేశంలో వ్యాపించిన అన్యాయం పై పోరాటం సాగించడానికి ఇన్‌సాఫ్ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు కపిల్ సిబాల్ శనివారం ప్రకటించారు. ముఖ్యమంత్రులు, విపక్షాల నేతలు తమ మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. కపిల్ సిబాల్ ప్రారంభించిన ఈ వేదిక చాలా ముఖ్యమైన ఆవిష్కరణ అని, ఇందులో చేరాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నానని, మనమంతా కలిసి అన్యాయంపై పోరాటం సాగిద్దామని కేజ్రీవాల్ తన ట్విటర్ ద్వారా హిందీలో అభ్యర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News