Saturday, November 23, 2024

తమిళనాడు సిఎం స్టాలిన్‌తో భేటీ కానున్న ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ !

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకోవడంలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్‌ను కలుసుకోనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ బుధవారం ట్విట్టర్‌లో ‘కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా తెచ్చిన ‘యాంటీఢిల్లీ ఆర్డినెన్స్’కు వ్యతిరేకంగా డిఎంకె మద్దతును కూడగట్టుకునేందుకు జూన్ 1న చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ కానున్నాను’ అని పేర్కొన్నారు.

గమనించాల్సిన విషయం ఏమిటంటే కేజ్రీవాల్ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టుకునేందుకు మే 23 నుంచే దేశవ్యాప్తంగా పర్యటన నిర్వహిస్తున్నారు. కేజ్రీవాల్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌తో జూన్ 2న భేటీ కానున్నారు.
కేజ్రీవాల్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ లను కలుసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం మే 19న ఆర్డినెన్స్ జారీ చేసింది. దాని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(జిఎన్‌సిటిడి)లో ‘ఉద్యోగాల బదిలీలు, విజిలెన్స్, ఇతరములు’కు సంబంధించిన రూల్స్ విషయంలో ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టం 1991కి తెచ్చిన సవరణ. పైగా కేంద్రం వర్సెస్ ఢిల్లీ కేసులో సుప్రీంకోర్టు తీర్పును కాదని తెచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News