Monday, January 20, 2025

ఇడి విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కిర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై నవంబర్ 2న విచారణకు రావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీచేసిన సమన్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బేఖాతరు చేశారు. ఇడి విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. దీనికి బదులుగా మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలసి ఆయన రోడ్‌షోలో పొల్గొననున్నారు.

విచారణకు హాజరుకావాలంటూ తన జారీచేసిన సమన్లను ఇడి ఉపసంహరించుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇడి తనకు సమన్లు జారీచేయడం చట్టవిరుద్ధమని, ఇడి రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆయన ఆరోపించారు. ఇడి పంపిన సమన్లకు బదులుగా కేజ్రీవాల్ దర్యాప్తు సంస్థకు ఒక లేఖాస్త్రాన్ని సంధించారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో తాను ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకునే ఉద్దేశంతోనే ఇడి ఈ సమన్లు జారీచేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బిజెపి ప్రోద్బలంతోనే తనకు ఇడి సమన్లు జారీచేసిందని కూడా ఆయన తన లేఖలో ఆరోపించారు. ఇడి కార్యాలయంలో కేజ్రీవాల్ హాజరవుతారన్న ఉద్దేశంతో ఢిల్లీలోని ఇడి కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇడి కార్యాలయం సమీపంలో ఆప్ కార్యకర్తలు గుమికూడకుండా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News