న్యూఢిల్లీ: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనల మధ్య అంతర్జాతీయ విమానాలపై కేంద్రం ఆంక్షలు విధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గత ఏడాది కరోనా మొదటి దశ సమయంలో కూడా అంతర్జాతీయ విమాన ప్రయాణాలను నియంత్రించడంలో భారత్ ఆలస్యంగా స్పందించిందని ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి ఇప్పటికే అనేక దేశాలు విమాన రాకపోకలను నియంత్రించాయని, మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నామని ఆయన ప్రశ్నించారు. వివిధ దేశాల నుంచి వచ్చే విమానాలు ఎక్కువ శాతం ఢిల్లీ లోనే దిగుతాయి. దాంతో ఈ రాజధాని నగరంపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిఎం సార్ … దయచేసి విమానాలు ఆపండి. అంటూ ట్విటర్ వేదికగా కేజ్రీవాల్ ప్రధానిని అభ్యర్థించారు. అలాగే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి చండీగఢ్‌లో కరోనా పాజిటివ్‌గా తేలిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ వ్యక్తితోపాటున్న మరో ఇద్దరికి కూడా వైరస్ సోకింది. ప్రస్తుతం వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు.
Kejriwal Urges Centre to stop International flights