Saturday, November 16, 2024

ఢిల్లీని సర్వనాశనం చేయాలనుకుంటున్నారా..?: సునీత కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ కేసుతో కేజ్రీవాల్ సంబందం లేదని చెప్పారు. లిక్కర్ స్కాం పరుతో 250కిపైగా దాడులు చేశారని మండిపడ్డారు. ఢిల్లీని సర్వనాశనం చేయాలనుకుంటున్నారా? అని నిలదీశారు. కేజ్రీవాల్ శరీరం జైలులో ఉన్నా.. ఆయన ఆత్మ మాత్రం ప్రజల్లో ఉందన్నారు. లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో రేపు కోర్టులో దేశ ప్రజలకు కేజ్రీవాల్ చెబుతారని ఆమె తెలిపారు.

లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కు ఎనిమిదిసార్లు నోటీసులు ఇచ్చింది ఇడి. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే, దీంట్లో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఇడి అధికారులు..కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ఇడి కస్టడీలో ఉన్నారు. రేపటితో కస్టడీ పూర్తి కానుండడంతో ఆయనను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఇడి అధికారులు హాజరుపర్చనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News