Monday, December 23, 2024

ఆ పిటీషన్లను వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రెండు పిటీషన్లను ఆయన వెనక్కి తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయడంతో అరెస్టు తప్పుబడుతూ అత్యవసర విచారణ చేయాలని రెండు పిటీషన్లు సుప్రీంలో దాఖలు చేశారు. కోర్టు విచారణకు కొంచెం ముందే రెండు పిటీషన్లను ఆయన లాయర్లు వెనక్కి తీసుకున్నారు. పిటీషన్లు ఎందుకు వెనక్కి తీసుకున్నారనేదానిపై లాయర్లు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. అరెస్టుకు వ్యతిరేకంగా కాకుండా బెయిల్ వచ్చేవిధంగా పిటీషన్లను మూవ్ చేయాలని కేజ్రీవాల్ లాయర్లు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. బెయిల్ పిటీషన్లు దాఖలు చేస్తే త్వరగా బయటకు రావొచ్చనే ఉద్దేశంలో వారు ఉన్నట్టు తెలుస్తుంది.

కొన్ని రోజుల క్రితం స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు చేసినప్పుడు అరెస్టుకు వ్యతిరేకంగా ఆయన లాయర్ల పిటీషన్లు దాఖలు చేశారు. దీంతో ఆయనకు బెయిల్ ఆలస్యంగా వచ్చిందనే చర్చ జరిగింది. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టు జరిగిపోయిందని, బెయిల్ కోసం పిటీషన్లు మూవ్ చేసే సరిపోతుందని ఆయన లాయర్లు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News