Friday, November 22, 2024

కరెన్సీ నోట్లపై దేవుళ్ల చిత్రాలు ముద్రించండి

- Advertisement -
- Advertisement -

Kejriwal writes to PM Modi

మోడీకి కేజ్రీవాల్ లేఖ

న్యూఢిల్లీ: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలను ముద్రించాలని పిలుపునిచ్చి రాజకీయ వర్గాలలో కలకలం సృష్టించిన ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదే డిమాండును పునరుద్ఘాటిస్తూ గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. భారతీయ ఆర్థిక పరిస్థితి మెరుగైన స్థితిలో లేదని, మళ్లీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి దేవుళ్లు, దేవతల ఆశీస్సులతోపాటు గట్టి చర్యలు అవసరమని బుధవారం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా..కరెన్సీ నోట్లపై ఒక పక్కన మహాత్మా గాంధీ చిత్రం, మరో వైపున లక్ష్మీదేవి, వినాయకుడి చిత్రాలు ముద్రించాలన్నది 130 కోట్ల మంది భారతీయుల అభీష్టంగా గురువారం మోడీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. తన డిమాండుకు విశేషమైన మద్దతు లభించిందని, ప్రతి ఒక్కరూ ఇది వెంటనే అమలు కావాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి కష్టకాలాన్ని ఎదుర్కొంటోందని, 75 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా భారత్ వర్ధమాన దేశాల జాబితాలోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా&కేజ్రీవాల్ డిమాండుపై బిజెపి తీవ్రంగా స్పందించింది. గుజరాత్, హిమాచల ప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ తన హిందూ వ్యతిరేక వికృత స్వరూపాన్ని దాచుకోవడానికి విఫలయత్నం చేస్తోందని బిజెపి విమర్శించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News