Sunday, January 19, 2025

మీ దోస్తులకు అందే బడా కాంట్రాక్టులే తాయిలాలు

- Advertisement -
- Advertisement -

Kejriwal's Attack on PM Modi's Freebies Remark

ప్రధాని మోడీపై కేజ్రీవాల్ విసుర్లు

న్యూఢిల్లీ : ఉచిత విద్య, ఆరోగ్య పరిరక్షణ కల్పనలు తాయిలాలు ఎట్లా అవుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. వీటిని ఎన్నికల లబ్ధిఖాతాలోకి వచ్చే ఉచితాలుగా పేర్కొనడం కుదరదని స్పష్టం చేశారు. భారత్‌లో ఎవరికి తాయిలాలు అందుతున్నాయనేది జగద్విదితం అని ప్రధాని మోడీని ఉద్ధేశించి పరోక్ష విమర్శలకు దిగారు ఉచిత విద్య, ఆరోగ్యపరిరక్షణ, ఉచిత విద్యుత్ వంటివి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా చేసే దిశలో జరిగే ప్రయత్నాలలో భాగాలని తెలిపారు. ఢిల్లీలో ఉచిత విద్యుత్, విద్య , ఆరోగ్య కల్పనను చేపట్టామని, భగవంతుడి ఆనతి ఉంటే ఇవి దేశవ్యాప్తం అవుతాయని తాను భావిస్తున్నానని కేజ్రీవాల్ చెప్పారు. శనివారమే ప్రధాని మోడీ దేశంలో ఉచితాలు అనుచితం అని ఓ సమావేశంలో పేర్కొన్న అంశాన్ని కేజ్రీవాల్ పరోక్షంగా ప్రస్తావించారు. ఎవరు ఎవరికి రెవాడీలు లేదా తాయిలాలు ఇస్తున్నారనేది దేశవిదితం అని మోడీపై పరోక్ష విసుర్లతో కేజ్రీవాల్ మండిపడ్డారు.

దోస్తులకు రెవాడీలుగా వారి పన్నుల మాఫీలకు దిగడం, ఇవి వేలాది కోట్ల విలువలో ఉండటం , విదేశీ పర్యటనకు అధికార ఖర్చులతో వెళ్లి, అక్కడ బిజినెస్‌మెన్ పాత్ర వహించి తన వారి కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను సంపాదించుకుని రావడమే అతి భారీ తాయిలం అని కేజ్రీవాల్ విమర్శించారు. కొందరికే ప్రయోజనాలు కల్పించి, ఎందరికో ఖేదం కల్గించే ఈ రేవడీల సంగతేమిటని ప్రశ్నించారు. ఢిల్లీలో ప్రవేశపెట్టిన ఫరిస్తే స్కీం వల్ల ఎందరి ప్రాణాలనో రక్షించామని కేజ్రీవాల్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ఈ స్కీం పరిధిలో సాయం అందించడం జరిగిందని, దీనిని రేవడీ అంటారా? అని ప్రధానికి కేజ్రీవాల్ ప్రశ్న వెలువరించారు. దేశంలో ఇప్పుడు రెండు రకాల రాజకీయాలు ఉన్నాయని, ఒకటి నిజాయితీతో కూడిన రాజకీయం, మరోటి అవినీతిభరిత రాజకీయం అని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News