Sunday, January 19, 2025

క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం… జైలులో పొంచి ఉన్న ముప్పు

- Advertisement -
- Advertisement -

తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈడి అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నప్పటినుంచీ కేజ్రీవాల్ 4.5 కిలోల బరువు తగ్గారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా బరువు తగ్గడం ఆందోళనకరమని, ఆయన ఆరోగ్యాన్ని ప్రతి క్షణం కనిపెడుతూ ఉండాలని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పడిపోయాయని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేజ్రీవాల్ బరువు తగ్గారన్న వార్తలో నిజం లేదని తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు.

ఇదిలాఉండగా జైలులో కేజ్రీవాల్ కు ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు. కరడుగట్టిన నేరస్థులకు ఆలవాలమైన తీహార్ జైలులో ఆయనపై దాడి జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో ఈ జైలులో హత్యలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. 2021లో రామస్వామి అనే ఖైదీని హత్య చేశారు. కొందరు ఖైదీలు అతన్ని క్రికెట్ బ్యాట్లతో కొట్టి చంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News