Monday, December 23, 2024

కేజ్రీవాల్‌జుడిషియల్ కస్టడీ సెప్టెంబర్ 25 వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

ఎక్సైజ్ కుంభకోణంతో ముడిపడిన అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు ఢిల్లీ కోర్టు బుధవారం పొడిగించింది. ఇదే కేసులో ఆప్ నాయకుడు దుర్గేష్ పాఠక్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కేవేరీ బవేజా ఉత్తర్వులు జారీచేశారు. కేజ్రీవాల్, పాఠక్, ఇతరులపై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను స్టెప్టెంబర్ 3న పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి ఈ నెల 11న కోర్టులో హాజరుకావాలని పాఠక్‌ను ఆదేశించారు. దీంతో బుధవారం కోర్టులో హాజరైన పాఠక్‌కు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News