Saturday, December 21, 2024

కోహ్లీ, డాన్ బ్రాడ్‌మాన్ రికార్డు కొల్లగొట్టిన కెన్ విలియమ్సన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో కివీస్ ఆటగాడు కెన్ విలియమ్సన్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 118 పరుగులు చేయడంతో 30 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ, డాన్ బ్రాడ్‌మాన్ 29 సెంచరీల రికార్డును అధిగమించాడు. టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక శతకాలు బాధిన 13వ వ్యక్తిగా రికార్డులోకెక్కాడు. సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ జెహెచ్ హలీస్ 45 సెంచరీలతో రెండో స్థానం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ 41 సెంచరీలతో మూడో స్థానం, శ్రీలంక ఆటగాడు కుమారా సంగాక్కర్ 41 సెంచరీలతో నాలుగో స్థానం, టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ 38 సెంచరీలతో ఐదో స్థానంలో ఉన్నారు.
సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ రెండో రోజు కివీస్ 141 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 475 పరుగులతో ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర డబుల్ సెంచరీతో కదం తొక్కాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News