Monday, December 23, 2024

తల్లవఝల కేంద్ర సాహిత్య పురస్కారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ తెలుగు కథా, నవలా రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రిని కేంద్ర సాహిత్య అకాడ మీ అవార్డు వరించింది. ఆయన రచించిన ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ అనే లఘు కథల పుస్తకానికి ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా 24 భాషల్లో రాసిన కథలను కేంద్ర సాహిత్య అ కాడమీ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఢి ల్లీలోని ఫిరోజ్ షా రోడ్డులో రబీంద్ర భవన్‌లోని సాహిత్య అకాడమీ కాన్ఫరెన్స్ హాలు లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అ వార్డులను ప్రకటించారు.

తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి 1945లో  పిఠాపురంలో జన్మించారు. రామేశ్వరం కాకులు నుంచీ రోహిణి కథ వరకూ పలు కథలను ‘రామేశ్వరం కాకు లు.. మరికొన్ని కథలు’ పేరిట పుస్తకంగా ముద్రించారు. ఒంగోలు కళాశాలలో విద్యనభ్యసించిన ఆయన ఆ తర్వాత తిరుపతి, పుణేల్లోనూ చదివారు. పుణెలోని ప్రతిష్టాత్మ క దక్కన్ కాలేజీ నుంచి పురావస్తు శాస్త్రం లో డాక్టరేట్ అందుకున్నారు. అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా పనిచేసిన పతంజలి శాస్త్రి రాజమండ్రిలో పర్యావరణ సెంటర్‌ను నిర్వహించారు. వడ్ల చిలుకలు, పతంజతలి శాస్త్రి కథలు, నలు పెరుపు వంటి కథా సంపుటాలు ఆయన రచనలొ మరికొన్నిగా చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News