Wednesday, January 22, 2025

కానిస్టేబుల్ ఇంట్లో దొంగతనం…

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: కానిస్టేబుల్ ఇంట్లో దొంగల చొరబడి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ఒడిశా రాష్ట్రం కేంద్రపారా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిమాలెండూ పది అనే కానిస్టేబుల్ జజంగా ప్రాంతంలో ఔట్‌పోస్టు నంబర్ వన్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. తన కుటుంబం, సహోదరుడి కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. సదరు కానిస్టేబుల్ తల్లిదండ్రులు అశిష్, మినాటి ఇంట్లోనే ఉన్నారు. కానిస్టేబుల్ ఇంట్లోకి దొంగలు టెర్రస్ పైనుంచి చొరబడ్డారు. బీరువాలో ఉన్న రూ.30 వేల నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దొంగలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఐరన్ రాడ్‌ను మరిచిపోయారు. కానిస్టేబుల్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: బాలికపై మేనత్త కుమారులు సామూహిక అత్యాచారం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News