Monday, January 20, 2025

కేరళ పేరు ‘కేరళం’గా మార్చాలని అసెంబ్లీ తీర్మానం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రం పేరును మార్చాలని నిర్ణయించింది. కేరళ పేరును కేరళం అని మారుస్తూ సిఎం పినరయి విజయన్ బుధవారం నాడు ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అటు కాంగ్రెస్ కూడా ఎటువంటి సవరణలు సూచించలేదు. దీంతో ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన ప్రభుత్వం.. అన్ని అధికారిక రికార్డులలో రాష్ట్రాన్ని కేరళం అని మార్చాలని కోరింది. కేరళను పూర్వకాలం నుంచే మలయాళంలో కేరళం అని పిలిచేవారని సిఎం పినరయి విజయన్ తెలిపారు. ’

మలయాళం మాట్లాడే ప్రజల కోసం ఐక్య కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్వాతంత్య్రానికి ముందే నుంచే ఉందని, రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మా రాష్ట్రం పేరును కేరళ అని రాశారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం దానిని కేరళం అని సవరించాలని కోరారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో తక్షణమే మార్పులు చేయాలి అని విజయన్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News