Wednesday, October 16, 2024

మీ జమిలి మాకొద్దు:కేరళ అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

ఒకే దేశం , ఒకే ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్ణయం మానుకోవాలని కేరళ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. జమిలి ఎన్నికలపై ఏర్పాటు అయిన కోవింద్ కమిటీ నివేదికను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలను సానుకూలం చేసుకుని జమిలి నిర్వహణకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ దశలోనే వామపక్ష కూటమి ప్రభుత్వం నుంచి జమిలి నిర్ణయం ఉపసంహరణకు తీర్మానం వెలువడటం కీలకం అయింది. జమిలి ప్రతిపాదన అప్రజాస్వామికం అని అసెంబ్లీ తీర్మానంతో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తరఫున అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ఎంబి రాజేష్ ప్రవేశపెట్టారు. దేశంలోని సమాఖ్య విధానానికి ఈ జమిలి ప్రతిపాదన అడ్డంకిగా మారుతుందని తీర్మానంలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి ఇప్పుడు ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేదు.

అన్ని పక్షాల మద్దతుతో జమిలి వ్యతిరేక తీర్మానం ఆమోదం పొందింది. జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తూ తీర్మానం వెలువరించిన తొలి రాష్ట్ర అసెంబ్లీ కేరళనే అయింది. దేశంలోని వైవిధ్యపు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంతర్లీన లక్షణాలకు జమిలి ప్రక్రియ గండికొడుతుంది. ఎన్నికల వ్యయ భారం తగ్గించేందుకు జమిలి తీసుకువస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం అసంబద్ధం అని తీర్మానంలో తెలిపారు. ఎన్నికల వ్యయాన్ని కుదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. పరిపాలన సజావుగా సాగేందుకు వేరే చర్యలకు దిగవచ్చు. వీటిపై దృష్టి సారించకుండా జమిలికి కేంద్రం జై కొట్టడం దురుద్ధేశపూరితం అని తీర్మానంలో స్పష్టం చేశారు. రాజ్యాంగ హక్కులు, ప్రజల భావనలకు , ఇప్పటివరకూ నెలకొని ఉన్న సంవిధానానికి కేంద్రం ప్రతిపాదన విరుద్ధం అవుతోందని విమర్శించారు. జమిలి ఆలోచనలు అన్ని కూడా ఆర్‌ఎస్‌ఎస్ , బిజెపిల కలిసికట్టు కేంద్రీకృత అధికార చలామణి అజెండా కోణంలో రూపుదిద్దుకున్నవే అని మంత్రి రాజేష్ పేర్కొన్నారు.

సెప్టెంబర్ 18వ తేదీన కేంద్ర కేబినెట్ రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటు జరుగుతుందని పేర్కొంది. ఈ విధంగా దేశంలో ఒకే సారి ఎన్నికల విధానాన్ని వేగవంతం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News