Thursday, January 23, 2025

పెళ్లి దుస్తుల్లో పరీక్ష హాలుకు (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: ఎవరికైనా వివాహ మహోత్సవం జీవితాంతం గుర్తుంచుకునే మధుర జ్ఞాపకం. పెళ్లి మండపంలో వరుడితో కలసి పటీల మీద ఉండాల్సిన వధువు పరీక్ష హాలులో ఉండాల్సిన గడ్డు పరిస్థితే ఎదురైతే… ఈ సంకట పరిస్థితే ఎదరైంది కేరళకు చెందిన ఆ పెళ్లికుమార్తెకు. పెళ్లి జరగాల్సిన రోజే అత్యంత ముఖ్యమైన ప్రాక్టీకల్ పరీక్ష ఉండడంతో పెళ్లి బట్టల్లో నేరుగా కళ్యాణ మండపం నుంచి పరీక్షా సెంటర్‌కు వచ్చేసిందా పెళ్లికుమార్తె.

పెళ్లి కోసం కట్టుకున్న చీరపైన ల్యాబ్ కోటు, మెడలో స్టెతస్కోపు ధరించి పరీక్షకు హాజరైన ఆ పెళ్లికుమార్తెకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేరళలోని బెతానీ నవజీవన్ కాలేఫ్ ఆఫ్ ఫిజియోథెరపీలో చదువుకుంటున్న ఆ విద్యార్థినికి తోటి విద్యార్థులు పరీక్ష హలులో వివాహ శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 25 లక్షల మంది నెటిజన్లు ఈ వీడియో పలువురి హృదయాలను దోచుకుంది. వివాహం నాడే పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఎదురైనందుకు ఆ విద్యార్థినికి పలువురు శుభాకాంక్షలతోపాటు సానుభూతితో కూడిన కామెంట్లు పోస్టు చేశారు.

 

 

Courtesy by News 18 kannada

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News